కళ్లెం తీసిన కాలు: - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-9110347693
35 రోజులకు  విముక్తి-
మెడి కేర్
శ్రద్దకు పనితనానికి మొదటి స్థానం
నమ్మకానికి పునాది

డాక్టర్ రమ్మన్నాడు
కళ్లెం తీస్తానని
ఆనందం పారవశ్యము
నెలరోజుల బందీ నుండి విముక్తి
సంతోషంతో ఎడమ కాలు
ఎడబాటుకు ముక్తి

దవాఖానాకు వచ్చుడు
బెడ్ మీద పండుడు
ఆయా వచ్చుడు
కాలికింర రబ్బరు షీటు పరచుడు
డాక్టరు వచ్చి ప్లగ్ లో వైర్ పెట్టుడు
రంపం లాంటి ఆయుధంతో
కరకర కోసుడు

నాకు మనసులో భయం
కట్టు తీస్తుంటే
కొట్టుకుంటుంది గుండె వేగంగా
ఆవహించిన ఆందోళన

గుయ్ గుయ్ అంటూ చప్పుడు
అదిరిపోతోంది కాలు
ఎక్కడైనా తెగుతుందోననే భయం
కట్టడి చేశా మనసును
నాకు నేనే ధైర్యం
వికసించిన ఆత్మ వివేకం
దైవం మీద నమ్మకం
డాక్టరు మీద విశ్వాసం
పరిమళించిన వినయం!!

అబ్బా హాయి హాయి
మొత్తం మీద కట్టు కోయబడింది
చింత తొలగింది
మనసు ఊయలలూగింది
సంతోషంలో తేలిపోయింది!!

నాకు తోడు దొరికిందని
కుడికాలు ఎగిరి గంతేసింది
ఏదైనా  ఏమైనా రెండు ఉంటేనే
రెండు ఒకటైతేనే జీవితం!!
-----------


కామెంట్‌లు