కంటికి కనిపించని జీవనధారవు నువ్వు
కడలి అంత లోతున ఊరుతున్న అమృతానివి నువ్వు!
నేలతల్లి గర్భాన నిశ్శబ్ద జీవసిరివి నువ్వు
తరతరాల దాహాన్ని తీర్చే అక్షయ పాత్రవు నీవు!
ఆనాడు తాతలు తవ్విన బావిలో... కళకళలాడి
ఈనాడు మనవడు వేసిన బోరులో... బోరుమన్నావు!
అడిగినంత ఇచ్చే కామధేనువు అనుకుంటూ
అతిగా నిన్ను తోడేస్తూ అంతం చేస్తున్నాం!
వాన చినుకును వడిసి పట్టి నిన్ను నింపకపోతే
ఇంకుడు గుంతతో నీకు ఊపిరి పోయక పోతే
నీటి చుక్క కోసం రేపు యుద్ధమే మిగిలుంటుంది!
మట్టి పొరలు ఎండిపోతే.. పచ్చని చెట్టు చిగురిస్తుందా?
నీటి చుక్క రాలిపోతే.. రేపటి పొద్దు పొడుస్తుందా?
చెయ్యి చెయ్యి కలుపుదాం.. చినుకు చినుకు పట్టుకుందాం...
వాన చినుకును బంధించి భువి గర్భానికి పంపుదాం!
నీటిని పొదుపు చేస్తూ - భావితరాల దాహం తీర్చుదాం!
బోరు వేయడం హక్కైతే - నీటిని నింపడం బాధ్యత!
తరిగిపోతున్న జలనిధిని మళ్ళీ నింపుకుందాం!
అదే రేపటి తరానికి మనం ఇచ్చే జీవనాధారం!
భువిలోన ప్రాణధార నిండంగా,
భావితరాల భవిష్యత్తు లిఖించే పచ్చగా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి