మనం మన వెంటే ఉంటాం
మనం లేకున్నా ఉంటామంటే
దాన్ని నీడంటాం.
ఊపిరి కనబడదు
విశ్వాసం శ్వాస కూడా అంతే
మనుషులు కనబడనంత మాత్రాన
వాళ్లు లేరని కాదు
మనం గుడ్డి వాళ్ళమని అర్థం.
రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది
జీవనదిలా ఒకరి నుంచి ఒకరికి
ఆగిపోయినంత మాత్రాన
మది లేదని కాదు నది లేదని కాదు.
గుండె ఆగిందని అర్థం.
పేగుకు ప్రేమకు వారసత్వం ఉండదు.
సత్యం మాత్రమే ఉంటుంది.
ఎగిరే పక్షికి ఆకాశం ఉండదు
అవకాశం ఉండదు రెక్కలు మాత్రమే ఉంటాయి.
ఎగిరే మనసుకు గాలిగోపురం ఉంటుంది.,
అందానికి అర్థం పదార్థంలో లేదు
ఆకారం రంగు రుచి వాసనలా ఆలోచనలో ఉంది.
ఇష్టానికి అర్థం పదార్థంలో ఉంటుంది.
ఎముక వెన్నెముక అందరికీ ఆస్తి
అదే అస్తిపంజరం
పంజరంలోని చిలుక రక్త మాంసాలను
ముట్టదు
రక్త మాంసాలతో బ్రతుకుతుంది.
నీటిని పంజరంలో బంధించాలని చూస్తే
ముల్లోకాలలో మూడు అవతారాలు ఎత్తి
పాతాళ లోకంలో దాగింది సముద్రమై ఎదిగింది.
======================================
పూణే లత ఇంట్లో
01/05/2026
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా.
శ్రీ శ్రీ కళావేదిక.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి