మరుగున పడిన మగువలు 31:-అనువాదం..అచ్యుతునిరాజ్యశ్రీ
 డా.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh
వేముగంటి పాపయమ్మ గారు 1900 లో జన్మించారు .ఆమె తండ్రి బిందు మాధవ పంతులుగారు ,భర్త సంజీవరావు కాకినాడ నివాసి .5వ ఏటనే ఆమెకు వివాహం కావటం ఎనిమిదేళ్లకే బాలవితంతువు అయినా తల్లి ప్రోత్సాహంతో తెలుగు హిందీ సంస్కృతం ఇంగ్లీషు అభ్యసించారు 18  ఏళ్ల పాపయమ్మ కాంగ్రెస్ లో చేరారు. నూలు వడకటం నేత పనిలో ఆమె సిద్ధ హ స్తురాలైనారు. తన 88వ వయసులో కూడా తను స్వంతంగా వడికిన ఖాదీ చీరనే ధరించిన అద్భుత మహిళ .విదేశీ వస్తు బహిష్కరణ తోపాటు 1923 లో కాకినాడ కాంగ్రెస్ లో వాలంటీర్ గా పనిచేశారు. తన బంగారు నగలను గాంధీజీ కి సమర్పించారు .ఒక మీటింగు లో తన సొంత బండిలో గాంధీజీ కి ఎక్కడికి వెళ్లాలన్నా తగిన ఏర్పాట్లు చేశారు .వెల్లంగిలో ఆడవారంతా తమ బంగారు నగలు విరాళం ఒసగేలా ప్రోత్సహించారు .సీతానగరం ఆశ్రమంలో కస్తూర్బా గాంధీకి తోడునీడగా ఉండి ఆమెకు కావలసిన ఏర్పాట్లు చూశారు .అలా పాపయమ్మ అమ్మగారు గాంధీ కస్తూర్బాతో సన్నిహితంగా మెలిగారు .హిందీని బాగా నేర్చుకుని కాకినాడ సభలో ధారాళంగా మాట్లాడారు .ఎగ్జిబిషన్ కమిటీకి దేశసేవికా సంఘానికి ఆమె నాయకత్వం వహించారు .దువ్వూరి సుబ్బమ్మ గూర్చి హిందీలో అద్భుతంగా ప్రసంగిస్తే సరోజినీ నాయుడు మెచ్చుకున్నారు .పై చదువుల కోసం కుటుంబం సభ్యులు ఆమెను మద్రాసు పంపారు .అక్కడ పాపాయమ్మ కృష్ణ భాయ్ జమ్నాలాల్ మొదలైన వారిని కలిసి ఎన్నో రకాల కార్యక్రమాలలో భాగం పంచుకున్నారు .యూత్ లీగ్ లో ప్రముఖ పాత్ర పోషించి కాకినాడ తిరిగి వచ్చారు. హిందీ క్లాసులని తన ఇంట్లో నడుపుతూ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలకి అమ్మాయిలని సిద్ధం చేశారు .ఆమె విద్యార్థిని సమాజ్ మహిళా విద్యాలయం రాజ్యలక్ష్మి పుస్తక భాండాగారం హిందూ సుందరి మొదలైన సంస్థలతో బంధం ఏర్పరచుకున్నారు .సంస్కృత ఎలిమెంటరీ స్కూలు నడిపారు .ఆదర్శ సంఘసేవికా అని ఆమెకు బిరుదు ఇచ్చి గౌరవించారు .కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా ఇంకా ఖాదీ ఎగ్జిబిషన్లో ఆమె ఒడికిన నూలుకి 5000 రూపాయల బహుమతి పొందారు .దానిని మహిళా సమాజం కి విరాళం ఇచ్చారు. గాంధీజీని బాగా ఆకర్షించి ఆయన ఆశీస్సులు పొందింది. తన 80 ఏళ్ల వయసులో జాతీయ జెండాని ఎగరవేసిన గొప్ప దేశభక్తురాలు. 35 ఏళ్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ గా సేవలందించారు .హరిజన హాస్టల్ కమిటీ మెంబర్ .నిజంగా వేముగంటి పాపా యమ్మ గారు మనందరికీ ఆదర్శం.నాళం సుశీలమ్మ  భర్త శ్రీనాళం కృష్ణారావుగారు మధుర కవి,సంగీత కారుడు, అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న దేశ భక్తుడు.ఇంటిల్లిపాదీ నూలువడికి ఖద్దరు ధరించితీరాలనే శాసించారు ఆయన  .ఆమె తు.చ.తప్పకుండా పాటించారు.ప్రతిఏడూ గాంధీజీకి ఓజత చేతితో వడికిన నూలుతోనేసిన ఖద్దరు ధోవతులు పంపేవారు.భర్త కి కందుకూరివీరేశలింగంగారితో సన్నిహిత స్నేహ సంబంధాలు ఉండటంతో ఆకుటుంబాన్ని వెలివేశారు. ఐనా ఆదంపతులు గౌతమీజీవకారుణ్యసంఘంలో అనాథలు,దిక్కులేనివారికి చేయూత నిచ్చారు.సుశీలమ్మ గారిని అరెస్ట్ చేయలేదు ఆమె పికెటింగ్ లో పాల్గొన్నాకూడా🌷

కామెంట్‌లు