ఆకాశవాణి సమాచారం 3: -సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
 డాక్టర్.నాగసూరివేణుగోపాల్ 

సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
ఎం.ఎస్సీ.ఎం.ఫిల్  పూర్తిచేసిన నాగసూరిగారికి,ఆకాశవాణి లోస్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా ఉద్యోగం లభించడం ఓఎత్తు.బెంగుళూర్ లో పోటీపరీక్ష రాసి,మద్రాస్ లో ఇంటర్వ్యూ ఐనాక గోవాలో జాబ్ లో చేరటం ఓగమ్మత్తు.పనాజీలో ట్రెక్స్ గాఅంటే ట్రాన్సుమిషన్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు.ఒకేఒక్క తెలుగువాడు ఆయన. కొంకణి, మరాఠీ ఇంగ్లీష్, పోర్చుగీస్, హిందీ భాషల్లో ప్రసారాలు సాగేవి.మంగుళూర్ కి చెందిన  కన్నడ స్త్రీ శ్రీమతి వసంతకుమారి  స్టేషన్ డైరెక్టర్.గోవా ఆకాశవాణిలో పెక్స్ బాధ్యత పాత్ర ని బాగా ఔపోసన పట్టారు.ఆతర్వాత  యు.పి.ఎస్.సి.లో సెలక్ట్ అయి11ఏప్రిల్ 1991 లో అనంతపురం ఆకాశవాణిలో పెక్స్ గా ఎంజాయ్ చేశారు తన ఉద్యోగాన్ని. అప్పుడే రాణింపు గుర్తింపు జాబ్ లో సంతృప్తి ఆనందం తెలుస్తుంది.ఇక గోవాలో రేడియో ఉద్యోగిగా ఆయన జీతం1988లో కేవలం రు 1980 కన్నా తక్కువ.!ఒక అధికారిగా ఆకాశవాణిలో విద్యార్థుల చేత మొక్కలు నాటించటంతో జనాల్లో కొత్త ఉత్సాహం,ఆకాశవాణి అంటే ప్రజలకు మంచి అవగాహన కలిగింది.స్వచ్ఛందంగా గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.5ఆగస్ట్ 1994లో ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి బసవన్న  నల్లరాతివిగ్రహం చిన్న సైజుది తయారుచేయించి నెలకొల్పడం మరచిపోలేని అనుభవం.కళాకారుల ప్రసిద్ధ వ్యక్తుల చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. రత్నగిరి, హేమావతి, లేపాక్షి పేరుతో ప్రోగ్రాములను ప్రసారం చేయటం ఓమధురానుభవం.మనం ఏవృత్తిలో ఉన్నా పరిసరాల పరిశుభ్రత, అందంగా తీర్చిదిద్దటంలో శ్రద్ధ వహిస్తే చాలు.ఇది బడిలో తేలికగా చేయగలం. ఎందుకంటే పిల్లల్లో ఉత్సాహం,సృజనాత్మకత వెల్లివిరుస్తాయి.ఆకాశవాణి ఉద్యోగి ఏస్థాయిలో ఉన్నా సరే మైక్ వాడటం,టేపు మోయటం నామోషీ కాదంటారు వేణుగోపాల్ గారు. శ్రోతలకు ,ఎక్స్ పర్ట్ లకు వారధిగా ఎన్నో లైవ్ ఫోన్ ఇన్ చేశారు. ఆదివాసీ అంతరంగంతో ఆయన గళం శ్రోతలకు బాగా పరిచయమైంది. ఇక మద్రాస్ ఎఫ్.ఎం.గోల్డ్ లో ఉత్తరాలు లైవ్ గా చదవటం,తిరుపతి లో"రండి చూసొద్దాం తారామండలం" లైవ్  ప్రోగ్రాం ఇంకా 1ఫిబ్రవరి 1991లో తిరుపతి ఆకాశవాణి కేంద్రంమొదలైన రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తున్నప్పుడే దాదాపు 2గంటలు లైవ్ నిర్వహించారు.రక్తదాన సంబంధ అపోహలు పోగొట్టిన ప్రోగ్రాంగా అందరిప్రశంసలు అందుకున్న కార్యక్రమం అది🌷
కామెంట్‌లు