1991 లో ఆకాశవాణి అనంతపురంలో సర్దేశాయి తిరుమలరావుగారి ప్రసంగం విశేషాభిమానాన్ని పొందింది."కన్యాశుల్కం నాటకానికి కథానాయకుడు కందుకూరివీరేశలింగం" అన్న వాక్యంతో ఆయన ప్రసంగం ప్రారంభించి రక్తి కట్టించారు ఆయన. నాగసూరిగారు రేడియోలో ప్రోగ్రాములగూర్చి ఇచ్చిన వివరణ ఏమంటే,ప్రసంగాలు,పరిచయాలకు పావుగంట, పెద్ద నాటకాలకు గంట సమయం కేటాయిస్తారు.ఇప్పుడుకూడా దాదాపు ఇదే పద్ధతి కొనసాగుతోంది.అనంతపురం ఆకాశవాణిలో మొదట్లో సాయంత్రం 6నుంచి రాత్రి 9.30వరకే ప్రసారాలుండేవి.9 నుంచి పావుగంట సేపు ఆయన శ్రోతల ఉత్తరాలకు జవాబులు సాహిత్య ప్రసంగం, కథ రెండు కవితలు,పరిచయాలతో ప్రోగ్రాంలను ఆకర్షణీయంగా రూపొందించారు.1993 నుంచి ఆటైం రాత్రి 8.45_9కి మారింది.మూడు నెలలుముందే ప్లాన్ సిద్ధంచేసి దానికి తగిన వ్యక్తులను పిలిపించేవారు.ప్రసంగాలుచేసేవారికి రచనలు రెడీగా ఉంటే పెక్స్ చూసి రికార్డు చేయిస్తారు. కడప ఆకాశవాణి అనౌన్సర్ శ్రీగోపిగారు అనంతపురం అనౌన్సర్స్ కి శిక్షణ ఇచ్చారు.నాగసూరిగారి కెరీర్ లో తరచూ వివిధ ప్రాంతాలకు బదిలీలు అవటం ఆయన అభిరుచులకు తగిన గొప్ప ఛాన్స్ అనే చెప్పొచ్చు.ఆకాశ వాణి కేంద్రాల ఉత్సవాల్లో భాగస్వామి అయినందుకు ఆనందిస్తారు ఆయన. విశాఖ పట్టణ కేంద్రంలో ఎక్కువ విభాగాల పర్యవేక్షణ, వైవిధ్యభరితప్రోగ్రాములు చేయటం నిజంగా ఛాలెంజ్,సత్తా చాటేవి కూడా.ఎఫ్.ఎం.రెయాన్ బో మొదలవటం, ఫిల్మ్ పర్సనాలటీలతో లైవ్ ప్రోగ్రాంలనిర్వహణ మరపురాని అనుభవం.
1 ఏప్రిల్ 1950లో భారత ప్రభుత్వం నైజాంరేడియో ప్రసారాలను ఆకాశవాణిగా మార్చింది.2010లో వజ్రవారధి మనతెలుగు వంటి కార్యక్రమాలు నాగసూరిగారు రూపొందించారు 60ఏళ్ల పండుగ సందర్భంగా!
ఇక17 జూన్ 1963లో కడప ఆకాశ వాణి మొదలైంది.2012_2013 లో స్వర్ణోత్సవాలు కావటంతో ప్రోగ్రాంహెడ్ గా"ఈప్రాంతం_ఈవారం విరిజల్లు, అన్నమయ్య పదగోపురం, బ్రహ్మంగారి తత్వప్రభ" మొదలైన కార్యక్రమాలు చేశారు.అలాగే 2013లోమద్రాస్ కేంద్ర అమృతోత్సవాలలో భాగంపంచుకున్నారు. 2016_2018దాకా తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గా "ఉద్యోగంగా కాక ఉద్యమం"గా తన సత్తా చాటారు.ఆకేంద్రప్రారంభం,వేణుగోపాల్ గారి బర్త్ డే 1ఫిబ్రవరి కావటం ఓవిశేషం🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి