ఆకాశవాణి సమాచారం 6:- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
 

డాక్టర్ నాగసూరివేణుగోపాల్  సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
ఆకాశవాణి తిరుపతి కేంద్రం అశేషజనాదరణ పొందడానికి పొందటానికివిశేషకృషి చేసింది.ప్రతివారం శ్రోతల ఉత్తరాలు చదవటం,నిలువుటద్దం అనే ప్రోగ్రాంలో వివరణాత్మక లేఖలు,చిన్న ప్రసంగవ్యాసాలు మంజులాదేవిగారి గళంలో వేణునాదమైతే, అవసరమైనచోట నాగసూరిగారి జవాబు చోటుచేసుకోటంతో ఆప్రోగ్రాంరక్తి కట్టింది.ఇక 1963లో కడపరేడియోకేంద్రంలోని లైబ్రరీలో గాలించి సత్యం శంకరమంచిగారి అమరావతికథలను మంజుల గారి చేత ధారావాహికగా ప్రసారం చేయటం ఇంకో ప్రయోగం!
అలాగే మాతెలుగుతల్లికి మల్లెపూదండ ధారావాహికకుగూడా ఆమెగాత్రంలోనే ఘుమఘుమలాడింది.29మే1991 లోఅనంతపురం ఆకాశవాణికి ఆనాటి దినపత్రికలు బాసటగా నిలిచాయి.1996_2002లోవిజయవాడలో ఇండియన్ ఎక్స్ప్రెస్ రేడియోకేంద్రవిశేషాలు ప్రచురించటం ఓవిశేషం! పెక్స్ లుతమప్రోగ్రాం విశేషాలు అందులో రాయాలి.నాగసూరిగారు ప్రతిప్రోగ్రాం 20రోజులు ముందే రికార్డుచేయించేవారు.ఈయన టి.వి.సమీక్షలు వారంవారం ఆంధ్ర భూమి పత్రిక లో వచ్చేవి.కొందరు రచయితలను ప్రోత్సహించి పత్రికలకు ఏమి రాయాలో సూచించిన ఘనతనాగసూరిగారిదే మరి! చెన్నై ఆకాశవాణి ..బి లోతెలుగు ప్రోగ్రాములు అందరినీ అలరించాయి.తెలుగుడైలీపేపర్లుప్రోత్సహించాయి.వేణుగోపాల్ గారు కాలమిస్ట్ గా చాలా పత్రికల్లోరాయడం తో రేడియో ఢంకా బజాయించింది అని చెప్పవచ్చు.1993 జులై 25న,అనంతపురం ఆకాశవాణి" కథాతోరణం" ప్రోగ్రాంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడంతో,కలాలు చురుకుఉరుకుతో గళం విప్పాయి. అలా చేయూత నిచ్చిన వారు నాగసూరిగారు.వారధిగా జనాలు రేడియోకి సారధిగా అందుకే నిలిచారు ఆయన.2017లో సాహిత్య అకాడమీ ఆకాశవాణి సంయుక్తంగా,తెలుగుసాహిత్యానికి ఆకాశవాణి సేవలు అనే సదస్సు నిర్వహించినపుడు ఈయన చేసిన పరిశీలన  అందరిదృష్టిని ఆకర్షించటం విశేషం!1996లోవిజయవాడ రేడియోలో *ఉదయరేఖలు*లైవ్ ప్రోగ్రాంలనిర్వహణ లోఆరోగ్యవిషయాలు,పర్యావరణం,సైన్స్,చరిత్ర, సామాజిక ఆర్థిక విషయాలు,సాహిత్యం కళలు...ఇలా అన్నిటిపై  పట్టు బిగించి శ్రోతలకి మంచి అవగాహన కలిగించారు.విజయవాడ ఆకాశవాణిలో నాగసూరిగారికి చేయూత నిచ్చినవారు కీ.శే.పొట్లూరి వెంకటేశ్వర రావుగారు(సుమన్).అలా హేమాహేమీలతో రేడియో కేంద్రాలు శ్రోతల మదిని దోచుకున్నాయి🌷
కామెంట్‌లు