12జనవరి 1910లో గుడ్లవల్లేరులో పుట్టిన సీతామహలక్షమ్మ,తండ్రి పొట్లూరి వెంగయ్య. భర్త శ్రీ రామ బ్రహ్మం. పెళ్లయినతర్వాత ఆమె జామిగొల్వెపల్లి(గుడివాడ)నివాసి ఐనారు.ఈమె సత్యాగ్రహసమయంలో ఓబృందనాయకురాలిగా విదేశీ వస్త్ర మద్యం షాపుల ముందు పికెటింగ్ చేసి 144సెక్షన్ ని ధిక్కరించారు ఆమె.బాగా వెనుకబడిన ప్రాంతాలలో మహిళలతో పర్యటించిన ఆమె ని పోలీసులు ఇంటినుంచి బైటకి రావటానికి వీల్లేదని నిషేధంవిధిస్తే ఆమె ఎదురు తిరిగింది.ఆమెబృందంపై మురికి రంగునీళ్లు కారం బురద మద్యం కూడా మొహాలపై చల్లారు.కొంత మంది స్త్రీలు సొమ్మసిల్లి పడిపోయారు.అందరినీ అరెస్ట్ చేసి చాల నిర్మానుష్య ప్రాంతాల లో విడిచి పెట్టారు.కానీ ఆమహిళలు ఇంకా రెచ్చిపోటంతో పోలీసులు గ్రామస్తులను హెచ్చరించారు.వారికి ఆశ్రయం ఇవ్వరాదన్నారు. సీతామహలక్షమ్మని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తిరుచనాపల్లి జైల్లో ఉన్నారప్పుడు. ఆమె ఎన్నో ఉమెన్ కాంగ్రెస్ సొసైటీలను ప్రతిపల్లెలో నెలకొల్పింది.కాంగ్రెస్ అభ్యర్థిగా ,కృష్ణాజిల్లా మహిళాసభ ప్రెసిడెంట్ గా 1937_1947దాకా,ఆపై జిల్లా కాంగ్రెస్ బోర్డ్ మెంబర్ గా1939_1941 దాకా విశేష సేవలందించారు.1946_1951 దాకా ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం ఎం.ఎల్.ఎ.గా ఖ్యాతి గాంచారు.బడుగు బలహీన హరిజనులకోసం శ్రమించిన మహిళామణి ఆమె🌹
వల్లభనేని సీతామహలక్షమ్మ: సేకరణ.....అచ్యుతునిరాజ్యశ్రీ-8985035283
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి