ఆధారం ,బతుకు తిరిగే బొంగరం!ఆ దారం,బతుకు ఎగిరే గాలిపటం!ఆగని ఊపిరి,బతుకు నడిచే రహదారి!వాడని స్నేహం,బతుకు నిత్యం మధుమాసం!మనసు పిలుపు,బతుకు తిరుగు మలుపు!వీడని చేయూత,బతుకు సాగరాన ఎదురీత!నుదుటి వ్రాత,బతుకు గెలుపు గ్రహీత!తొలి పొద్దు,బతుకు నిత్యం తీపి ముద్దు!అసలు విందు,బతుకు పరమ పసందు!వేయు ముందడుగు,బతుకు ఆనందం మడుగు!నిరాశ నిస్తేజం !దురాశ దుఃఖబీజం!ఆశే మన ఆత్మతేజం!_________
ఆశే!:- డా పివిఎల్ సుబ్బారావు- విజయనగరం -94410 58797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి