నీవు నోళ్లు కొడతావు !వాడు రాళ్లు కొడతాడు!నీవు పాముకి పాలు పోస్తావు!వాడు ఆవుకి గడ్డి పెడతాడు!నీవు చెడు కి గడియ తీస్తావు!వాడు చెడుకి బిడియ పడతాడు!అందర్నీతొక్కిబతుకుతావు!వాడు బతుకుతూ బతుకిస్తాడు!నీవు జీవిస్తావు మరణం కోసం!వాడి మరణం జనజీవనం కోసం!రాళ్లు పునాది రాళ్లయ్యాయి!నోళ్లు మరి తెరుచుకున్నాయి!ఆవు పాలు అందరూ తాగారు!పాలు తాగినా పాము కాటేసింది!బిడియం బతుకు నిలబెట్టింది!తీసిన గడియ గండం తెచ్చింది!బతికిన ఒక్కడి పక్షం,జనం చేరారు!తొక్కినోళ్ళు తోక తొక్కిన,తాచులై నిలిచారు!మరణించినా గురుతే(వే) వాడు!చిగురు వరించని ఓ మోడే నీవు!__________
నీవు--వాడు!: - డా పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం,-9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి