ఖబర్దార్ ఓ చైనా!: =గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
చైనా చైనా చైనా నయవంచన చేసే ఓ చైనా
నీ అక్రమ దాడులను ఆపుకో నీవు ఇకనైనా 
ఆపకుండా అడ్డకాలు నీవు ఇక వేస్తే
నిన్ను ఎదుర్కొనే గుండె ధైర్యం మాకు మస్తే !

చైనా చైనా చైనా చైనా ఓ చైనా
నీ వక్రబుద్ధి మార్చుకో ఇకనైనా
స్నేహానికి భంగపాటు నీ ఈ చర్య
గమనించి నడుచుకో ఇక ఓ ఆర్య

సరిహద్దులో వివాదం అసలు వద్దు
ఎవరి హద్దుల్లో వారు ఉంటేనే ముద్దు
ఈ సత్యం తెలుసుకొని మసలుకో చైనా
అసత్య ఆగడాలకు పాల్పడకు ఇకనైనా!

దాడులు చేయడం మాకు వచ్చు
పెట్టగలం మీలో మీకు మేం చిచ్చు
మీరు చేసిన తప్పు మేమిక చేస్తే
మీకు మాకు భేదం లేదు గమనిస్తే!

చైనా చైనా చైనా చైనా ఓ చైనా
నక్కజిత్తుల మానుకో ఇకపైనా
ఏ దేశం కూడా నీకు లేదు సపోర్టు
అన్ని దేశాలది అదే కదా రిపోర్టు !

ఇరు దేశాలకు కలుగు విపరీత నష్టం
పరదేశాలకు మిగులు అపారమైన కష్టం
ఈ కష్ట నష్టాలకు అవుతారు బాధ్యులు మీరే
స్పష్టం చేశాక వినకుంటే మీకు ఇక మిగిలేది ఉరే!

హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు ఓ చైనా
బుద్ధి మార్చుకుని నడుచుకో ఇకనైనా
మారకుండా నీవు దూరి మా ముందుకు వస్తే
చూడకుండా మీ ముఖం మేం మరి పట్టేది కుస్తే !

వెన్నుపోటు పొడుచుటె మీకు రివాజు
కన్ను గీటి కలిసే మీకు పాకిస్తాన్ నవాబు
ఇంక మాకు తిరుగు లేదని మీరు అనుకోవద్దు
సంక నాకి అరిగిపోయి మీ మైత్రి అగు రద్దు !

మన దేశాల మధ్యలో ఉన్న సరిహద్దులో
అమరులైన వీర జవాన్లకు మా వందనం
సమర శంఖం పూరించి చేస్తాం అభివందనం
రధిర పంకం తుడిచేసి చేస్తాం నంద నందనం!

దున్న దున్నలు పోట్లాడితే కొట్లాడితే
లేగవాడలోని లేగ దూడలకు కలుగు నష్టం
ఇరుదేశాల మధ్య వద్దులే యుద్ధం
శాంతి ప్రశాంతికి కావాలి సన్నద్ధం!


కామెంట్‌లు