ఓం ఓంకారాయణ నమః
ఓం గీతా పారాయణ నమః
ఓం శ్రీ హరి పురహరి నమః
ఓం మురహరి జయ హరి నమః
నమో విష్ణురూపాయణ నమః
నమో కృష్ణ దీపాయణ నమః
రాసావులే నీవు మా తలరాత
గీసావులే ఇలలో మాకో గీత !
గీతా గీతా మా గానామృత మాత
ఆ కృష్ణ భగవానుడు చెప్పిన గీత
మాతా మాతా ఓ సహన సుజాత
మా పారాయణ నిత్య భగవద్గీత
ఆ గీత రాత ఒకటై కలిసేను
భగవద్గీతగా ఇలలో వెలిసేను
బోధించనుగా ఇక గీతా సారం
అందించనుగా అమృత సారం !
ఆ భగవంతుని భగవద్గీతా మాతా
పావన జీవన నరుల నవసంజాత
మాధుర్యపు మానస మనసంగీత
మంగళ శుభకర మా శ్రీకర సంకేత
ఓం నారాయణ నమః అను కుంటూ
ఓం గీతా పారాయణ నమః విను కుంటూ
సరుగున పరుగున భక్తులందరూ రారండి
వెరువక మరువక కానుకలెన్నో తేరండి !
మన పాంచజన్యమును ఊదండి
ఘన డమరుక దరువు వేయండి
మీ అడుగుల భజనలు చేయండి
ఆ స్వామి పల్లకిని ఇక మోయండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి