అక్షర సత్యాలు-జీవిత పాఠాలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
కష్టంతో వచ్చిన ఫలితము 
పెంచిన చెట్టు ఇచ్చిన ఫలము 
ఎంతో ఎంతో మాధుర్యము 
అక్షరాల సత్యము సత్యము 

గురువులు పంచే విజ్ఞానము 
పుస్తకాల పారాయణము 
చేకూర్చును మంచి మెండుగా
ఎదిగేందుకు నిచ్చెనేగా 

నీతిమంతుల సహవాసము 
కష్టాల్లో మనోనిబ్బరము 
చాలా చాలా అవసరమే 
కడు శ్రేష్టమైన క్షమాగుణము 

శృతిమించిన సోమరితనము 
అడుగడుగునా పిరికితనము 
చేయును బ్రతుకులు నాశనము 
చూడాల్సిందే అపజయము 


కామెంట్‌లు