అవ్వ హితవు :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
పేరాశే గలవాడు 
రేపునోయి ! కలహాలు 
చాడీలు చెప్పువాడు 
కూల్చునోయి! కాపురాలు 

చేయరాదు అన్యాయము 
చెప్పరాదు అబద్దము 
ఆ రెండు దుర్గుణాలు 
దైవానికి అసహ్యము 

ప్రతీకార జ్వాలలతో 
అసూయ ద్వేషాలతో 
రగిలిపోయే మనుషులు 
ఉండరు స్థిర మనసుతో 

అదుపులేని మనసులతో 
ఏదీ సాధించలేరు
అమితమైన ఆశలతో 
నెమ్మదిగా ఉండలేరు 


కామెంట్‌లు