మహిళామణులు ఘనులు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580 మే 14, 2026 • T. VEDANTA SURY వసుధలోన వనితలు వెలుగుతున్న దివ్వెలు దేదీప్యమానమే వారి మోవిని నగవులు సదనంలో సొగసులు గగనంలో తారలు అత్యంత కోమలము ఆడవారి మనసులు ఇంటికి ఆధారము అందాల మందారము జగతిలోన మహిళలు గౌరవింప మాన్యులు అమూల్యమైన అతివలు అవనిలోన వెలుగులు వారుంటే స్వర్గము లేదంటే నరకము కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి