తల్లి చల్లని పలుకులు :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
అమ్మ మాట తీయన 
అవు పాలు తెల్లన 
పెద్దల మాట వినిన 
జీవితాన దీవెన 

మంచు గడ్డ చల్లన 
నత్త నడక మెల్లన 
విలువలు కోల్పోతే 
అంతులేని వేదన 

అహర్నిశలు సాధన 
ఎదిగేందుకు నిచ్చెన 
స్వయం కృషి ఉన్నతము 
సమకూర్చును విజయము 

మితిమీరిన వాదన 
చివరికదే ఖేదము 
సమైక్యత భావన  
సృష్టించును స్వర్గము 


కామెంట్‌లు