సఖ్యతకు కృషి చేయాలి : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
సుతిమెత్తని హృదయాలు 
చేయరాదు గాయాలు 
ఊరట కలుగజేయాలి 
ఉత్తేజము నింపాలి 

విలువైనవి కుటుంబాలు 
చేయకు చిన్నాభిన్నము 
లేనిపోని తలపులతో 
పనికిమాలిన పనులతో 

చీల్చరాదు కాపురాలు 
పోయకూడదు నిప్పులు 
అసూయద్వేషాలతో 
సృష్టించరాదు కలతలు 

సమాధానానికి కర్తలు 
కావాలోయ్! కావాలోయ్! 
సమైక్యతకు కృషి ఎంతో 
చేయాలోయ్! చేయాలోయ్! 


కామెంట్‌లు