చంద్రాపురం గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. గ్రామంలో ఎవరికీ సాయం అవసరమైన తాను చేసేవాడు. పట్నం వెళ్లాలన్నా, పొరుగు ఊరు వెళ్లాలన్నా, చక్కగా మల్లయ్య వద్దకు వెళ్లి, నీవే సాయం చేయాలని అర్థించ్చేవారు. మల్లయ్య తన స్వంత వాహనంలో దింపి వచ్చేవాడు. మల్లయ్య సాయంతో లాభం పొంది, మల్లయ్య గూర్చి మర్చిపోయేవారు.
మల్లయ్య ఇంట్లో అందరూ నీకు పని లేకుంటే ఇంట్లోనే కూర్చో, కానీ నువ్వు అందరికీ సాయం చేసి, మంచి పేరు తెచ్చుకుంటున్నానని అనుకుంటున్నావు. నీవు చేసే అతి సాయం మాకు నచ్చడం లేదని, గునుక్కునేవారు. ఐనా మల్లయ్య మాత్రం తాను సాయం చేయడం మానలేదు. తాను కూలీ పని చేస్తూ, తీరిక సమయంలో అడిగిన సాయం మల్లయ్య చేస్తుండేవాడు.
ఒకరోజు మల్లయ్య పొలం వద్దకెళ్ళి, పనిచేస్తూ నీరసంతో చెట్టు క్రింద నిద్రపోయాడు. బాగా జ్వరం వచ్చినట్లయి లేవలేకపోయాడు. మల్లయ్య... మల్లయ్య... అంటూ చాలామంది జనం ఇంటికి రాసాగారు. ఏదో పని ఉండి, జనం వచ్చారని, మల్లయ్య ఇంట్లో లేడని, ఎవరికి సాయం చేయడానికి తిరుగుతున్నాడోనని, కోపంగా ఇంట్లో వాళ్ళు చెప్పారు. వచ్చిన వాళ్లు మల్లయ్య కోసం పొలం వద్దకు వెళ్లి, జ్వరంతో ఉన్న మల్లయ్యను ఆసుపత్రిలో చూపించి ఇంటికి తీసుకువచ్చారు. మల్లయ్యకు జ్వరం వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు పండు, ఫలంతో మల్లయ్య ఇల్లు నిండారు. అందరిని చూసేసరికి మల్లయ్యకు జ్వరం ఎప్పుడో తగ్గిపోయింది. మల్లయ్యది అతి సాయం అంటూ గునిగే కుటుంబ సభ్యులు తమ తప్పు తెలుసుకున్నారు. మరుసటి రోజు నుంచి మల్లయ్య సాయాలకు కుటుంబ సభ్యులు కూడా సహకరించసాగారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి