ప్రవాసంలో పద్య పరిమళం : - న్యస్తాక్షరి : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నియమిత పాదములో నియమిత అక్షర స్థానములో ఖచ్చితమైన అక్షర నియమము మరియు అడిగిన చందస్సులో, అడిగిన విషయముపైన పద్యము. 
పాదము        అక్షరం 
01                   01        జ 
02                   04        న 
03                   06        కు 
04                   15        డు 
విషయం : రామ నామ మహిమ 
ఛందస్సు : చంపక మాల 
(జ)నకతనూజ వల్లభుడు సామజ విక్రమ కోసలేంద్రు  డీ 
తనువు(న) రోమ రోమమున తారక మంత్రముగా వసించి నా
మనసును తా(కు)చున్ మధుర మంజుల నామ సుధాస్రవంతిలో 
మునుగగ పారవశ్యము ప్రమోదము మెం(డు)గ భక్తి భావనల్ 
#############

కామెంట్‌లు