సృష్టి లా: - డా ప్రతాప్ కౌటిళ్యా.
కలిస్తే సముద్రంలో నదులు కలిసినట్లు ఉండాలి 
మెరిస్తే ఆకాశంలో మెరుపులు మెరిసినట్టు ఉండాలి 
మాట్లాడితే ఉరుములు ఉరిమినట్టు ఉండాలి 
ఎదురుపడితే పిడుగు పడినట్లు ఉండాలి. 

నడిస్తే నదులు పారినట్లు ఉండాలి 
కురిస్తే ఆకాశం చిల్లులు పడి వర్షం కురిసినట్లు ఉండాలి. 
వీస్తే ఇసుక తుఫాను లా ఉండాలి. 
కళ్ళు తెరిస్తే సముద్ర ఉప్పెనలా ఉండాలి. 
గురి చూస్తే తుపాకీ గుండు లా ఉండాలి. 

గుహల్లో గబ్బిలాల్లా
తొర్రల్లో గుడ్లగూబల్లా 
గోపురాల్లో పావురాల్లా
పంజరంలో చిలుకల్లా 
బతకడం కోసం మీకు రెక్కలెందుకు.!!?

ఆకాశంలో గద్దల్లా
అడవుల్లో నెమల్లల్లా
నదుల్లో బాతుల్లా 
చెట్లపై పిచ్చుకల్లా
బతకడం కోసం మీకు కాళ్ళెందుకు..!!?

నీటిలో చేపల్లా 
నీటిలో పాముల్లా
నీటిలో కప్పల్లా
బతకడం కోసం మీకు చేతులెందుకు.!!?

గాలిలా చొరబడండి 
కాంతిలా దూసుకుపోండి 
శబ్దంలా విస్తరించండి. 
సృష్టించే సృష్టికర్తలా
సృష్టించే సృష్టిలా ఉండండి.!!?

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ శ్రీ కళావేదిక.

కామెంట్‌లు