చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్

 ఉత్పలమాల

పర్రెలు వారినట్టి ధర పారుతు నీళ్ళకు చిత్తడైనచో
సౌరులు దీరి నాగలికి చక్కని విత్తులు రైతులేయగా
పైరులు యేపుగా యెదిగి బంగరు పంటలు దీయుటందిలన్
కారుకు పుట్ల రాశులను కానుక నిచ్చెను యన్నపూర్ణయై
 

కామెంట్‌లు