కుశ నాభుల కుమార్తెల వృత్తాంతం : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రామా నీవడిగిన ప్రదేశము గూర్చి తెలుపెద వినుము 
కుశుడనే మహానుభావుడు 
మా వంశమునకు మూల పుత్రుడు 
అతడు బ్రహ్మ మానస పుత్రుడు 

ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి
ఆమె ఉత్తమమైన వంశ  జాతకురాలు 
ఆ దంపతులకు నలుగురు పుత్రులు 
తల్లిదండ్రులకు దీటైన వారు 

వారుధర్మాత్ములు సత్యవంతులు 
కుమారులకు క్షత్రియ ధర్మము బోధించినాడు 
ధర్మమైన ప్రజాపాలన చేయాలని
వారు ప్రజా అభిమానము పొందినారు 

నలుగురి పుత్రులకు నాలుగు పురములనిచ్చినాడు
కుశాంబుడు కౌశాంబిపురమును
కుశనాభుడు మహోదయ పట్టణమును 
ఆధూర్త రజసుడు ధర్మారణ్యమును 
పసువు అనురాకుమారుడు వజ్రాపురం ఏలినారు 

మా గది అను పేరుగల శోణ సదము
మిక్కిలి రమ్యమైనది 
మగధ దేశంమున
అన్ని ప్రాంతాలలో ప్రవహించుచు 
ఐదుపర్వతాల మధ్య మాలవలే సోబిల్లుచున్నది


కామెంట్‌లు