సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -217: ఆస్తికో కొడుకు - ప్రేమకో బిడ్డ కావాలె
*****
"అవ్వా! మనమేడున్నం శెప్పు?"
 "గదేంది శెల్లే! గమ్మతిగ అడగవడ్తివి. ఆలతి ఎట్లుంది? ఏవన్న కవురుదప్పినవా ఏంది? మనింటికొచ్చినవ్! ముచ్చెటి శెబుతున్నవ్. గింతట్లనే ఏం యాదికొచ్చిందో నీకు గిట్లడిగినవ్? మనింట్ల బల్లెపీట మీద నువ్వు ఆరాం కుర్శీల నేను కూసోని ఉన్నం
.ఓష్! గిదా నువ్వు అడిగేది. మారిన కాలంల ఉన్నం శెల్లె! గిప్పుడెవల్ని సూశినా సుకాశి పానాలైనయి. నీడ పట్టున గాలి పంక కింద కూసోని అస్సురుస్సుఅంటున్నరు.
 మా అప్పుడైతే అమ్మ నాయినతో కల్శి రెక్కల కట్టం సేశేటోళ్ళం.ఇంట్లె గిజగిజమని బోల్డంత మందిరిమి ఉండేటోల్లం.తలో పని అందుకుని కలో గంజో తాగి బతుకుల్ని బెమ్మాండంగ గడిపేటోల్లం.
ఇగ్గో గిప్పుడు నా దార్లెకి వొచ్చినవవ్వా! పతింట్లె ఇల్లెడు మందిరి ఉండేటోళ్ళు.సంతానాన్ని సంపదగా బావిచ్చేటోళ్ళు. మరి గిప్పుడవ్వా!
 గిప్పుడు ఒక్కరిద్దర్తోనే సాలిచ్చుకుంటుర్రు శెల్లే! గాళ్ళు ఆడైనా మొగైనా.."
అయితే అవ్వా! మన కోదండం మావ లేడు.గా మావ కొడుకు మహేష్కు ముగ్గురు ఆడివిల్లలే.అయితే మావఁ ఆత్తికో కొడ్కు కావాలె గీ తడవ మొగపిల్లగాడు పుడ్తడు కనమని ఆప్రీషన్ శేయించొద్దని గోడవట
అగ్గో అవ్వా! ముగ్గురు ఆడివిల్లలున్నా గాళ్ళట పేమకట.పుట్టే మొగ పిల్లగాడేమో ఆత్తికి ఇంటికి ఆరసుడంట.
 గీ దినాలలో గస్మంటోళ్ళు ఉన్నరంటే నాకనిపిత్తది శెల్లే! కాలం ఎంత మారినా మడుసులు కొందరు మార్లే.గాయన సంపాదించేదే అంతంత మాత్తరం.ఆత్తికో కొడుకు కావాల్నా. గస్మంటోళ్ళని సూశే "ఆత్తికో కొడుకు - పేమకో బిడ్డ" కావాలె అనే సామెత పుట్టింది.
 గా ముగ్గురు ఆడివిల్లల సద్వులు పెండ్లిళ్ళు పేరంటాలు చేసేతల్కి ఇంగ ఆత్తేముంటది అప్పులు తప్ప.
ఎవలైనా ఒక్కలో ఇద్దరో సాలు.గీ సామెత గిప్పుడు పాతవడివోయింది శెల్లే! మడుసులు,మన్సులు మారాలే.ఆడామగా సమానమే.ఇందిరా గాంధీ ఒక్కతైనా అమ్మ నాయినకే గాదు దేశానికి పెదాన మంతిరయ్యి పేరు తేలేదా శెప్పు.
అవునవ్వా! ఆత్తికి పేమకు ఎవలైనా ఏం లేదు గని ఇంకా గీ ఆలోచన్ల తేడా వోలేదు.
గదండీ సంగతి! "ఆస్తికో కొడుకు -పేమకో బిడ్డ కావాలె" అనే సామెత అంటే గిదే మరి.

కామెంట్‌లు