సుజలాం..సుఫలాం..సస్య శ్యామలాం.: - నాగవేణి చాగర్లమూడి-తెలంగాణ సాహితీ-భద్రాచలం..
భూగర్భ జలాలన్నీ నీరులేక 
ఎండమావులాయే..
మారింది కాలం ఇంకింది జలం 
అధునాతన పరిస్థితి తెచ్చింది ఈ దుస్థితి..జ
గతికి జలమే ముఖ్యం..జల సంరక్షణే లక్ష్యం

మారాలి మన పద్ధతి చేపట్టాలి జల జాగృతి 
జలం పుష్కలంగా ఉంటేనే ప్రాణకోటి సజీవం
 లేదంటే సమస్త ప్రపంచం నిర్జీవం
 జల సంక్షోభం తీరితేనే జన సంక్షేమవుతుంది
సాధ్యం..అందుకే 

ప్రతి నీటిబొట్టును ప్రాణంగా చూసుకుందాం..
తగినంతే ఖర్చు పెడదాం వృధా నీటిని 
ఇంకుడు గుంతలకు చేరవేద్దాం..
కురిసే జలసిరిని ఒడిసి పడదాం.. త్రాగు
మరియు సాగునీటి కొరతలను తరిమికొడదాం..

మనందరి బాధ్యతగా జల యజ్ఞాన్ని తలపెడదాం..
దేశాన్ని సస్యశ్యామలం చేసి చూపెడదాం..
జలమే మన బలం.. జలం లేని నేల శూన్యం
 ఆలోచిద్దాం సుజలాం సుఫలాం అన్న సూక్తిని ఆచరిద్దాం..


కామెంట్‌లు