అంబరమను అర్ణవంలో
కాలాన్ని మధించగా
ఆవిర్భవించి అలరించిన
మరో జ్యోతి కలశం!
అరుణ కాంతులు చిందిస్తూ
అపరంజి ధారలు కురిపిస్తూ
అవని నలుచెరగులా...
ఆనందం చిలకరిస్తూ......
దిక్కుల మధ్యన బంతిలా
మక్కువ నిండిన పాపలా
చక్కని వెలుగులు నింపుతూ
మిక్కిలి వన్నెలు ఒలికిస్తూ...
తూర్పు యవనిక మీద
మార్పు చిత్రాన్ని గీస్తూ
ఓర్పుగా ఎదురుచూచు
కుదురైన మదికి కుశలమిస్తూ..
తాను తిరుగక నిలబడి
తిరిగే భువిని తిలకిస్తూ
తరిగే కాలపు క్షణాలను
కానుకగా ఇచ్చే తరణికి..
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి