ప్రభాకరుడువచ్చినాడు..అడుగుదాము సంగతేమొ?
వినతిపత్రవీవెనతో..విసురుదాము సంగతేమొ!
వడదెబ్బతగలకుండ..ఆతిథ్యపు గొడుగవుతూ!
అగరుధూపహారతిచ్చి..కదుపుదాము సంగతేమొ!
చలివేంద్రపుపీటవేసి..నిమ్మరసం తాగిస్తూ!
రాలుతున్నప్రాణాలను..చూపుదాము సంగతేమొ?
ఆరోగ్యాన్నిహరించే..కూల్ డ్రింక్స్ తో ఓ 'సీతా!
పోటీపడవద్దంటూ..వేడుదాము సంగతేమొ?
మంత్రిగారి పర్యటనకు.. మారు రూపు కావద్దని
సూరన్నా దయతలచమని..అడుగుదాము సంగతేమొ?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి