ఆజ్ఞకు అతీతంగా
అంతరంగం ఎగరాలనుకుంటుంది…!
మనోభిలాషలకు
భావరూపం ఇచ్చే..
ఆ ఒక్క క్షణం కోసం
మనసు నిరీక్షిస్తుంది…!
ఆంక్షల మధ్య
ఆత్మగౌరవం కుంటుపడినా..
మౌనంగా మిగిలిన కలలు
మరువవు ఎప్పటికీ…!
స్వేచ్ఛ అంటే
అడ్డుగోడలు చెరిపేయడం కాదు..
తన మనసుని
తానే వినగలగడం…
తన జీవితానికి
తానే అర్థమవడం…!
రెక్కలు విప్పిన పక్షిలా
ఆకాశాన్ని తాకాలని...!
అలలతో ఉప్పొంగే సముద్రంలా
మనసు విరబూయాలని..
కాంక్షించేదే స్వేచ్ఛ…!!
"స్వేచ్ఛ లేని జీవితం
వెలుగు లేని ఉదయం లాంటిది…"
అందుకే...
రెక్కలొచ్చిన పక్షిలా...
స్వేచ్ఛగా విహరిద్దాం...!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి