జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల.
వజ్రానికి విలువేలా..!?
రాయి రత్నమైతేనే కదా
మురిసిపోతాం.....
ఆకాశం భూమికి దిగితే ఆశ్చర్యమేలా
నక్షత్రం భూమిపై నడిస్తే బిత్తర పోతాం.
మహావృక్షాన్ని చూసి భయమేలా
విత్తును చూసి మౌనమేలా
నాటి చూడండి......
ఎత్తయిన పర్వతాన్ని పైనుంచి కిందికి చూస్తే
కళ్ళు మూసుకుంటాం
అదే పర్వతాన్ని కింది నుంచి పైకి చూస్తే
కళ్ళు తెరుస్తాం
అది అద్భుతమేలా......
సముద్రం తుఫాను సృష్టిస్తుంది
మేఘం వర్షిస్తుంది
ఒకటి వరద ఒకటి నది
ఏది మంచిది భూమికి తెలుసు.!!?
విజయం వర్తమానం
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా..!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి