పత్తి కాయలతో పడుచు: -డా.. కందేపి రాణీప్రసాద్

 హలో పిల్లలూ! పత్తి చెట్టును చూశారా! చాలా మంది తమ పొలాలలో పత్తిని పండించుతూ ఉంటారు. మెట్ట పొలాల్లో పత్తి, నీళ్ళు ఉన్న పొలాల్లో వరిని పెంచుతారు. పత్తితో దారం తీసి బట్టలు నేస్తారని మీకు తెలుసు. పత్తి కాయలతో అమ్మాయిని సృష్టించవచ్చని తెలుసా! మెత్తగా ఉండే పత్తిని తీసివేసిన తరువాత గట్టిగా ఉండే కాయల విడి భాగాలు మిగులుతాయి. గుండ్రంగా ఉండే పత్తికాయ పగిలిన తర్వాత మెత్తని దూది పిల్లలను ప్రసవిస్తుంది. దూదిని ఏరిన తర్వాత ఎండిపోయిన కాయలు నాలుగు ముక్కలుగా విడిపోయి ఉంటాయి. నేనీ ముక్కలు తెచ్చి అమ్మాయిని చేశాను. పత్తి చెట్టు మాల్వేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది వాణిజ్య పంట. దీని శాస్త్రీయ నామం "గాసిపియం హెర్బేసియమ్". ఈ పత్తి పంట మొదలై సుమారు ఏడు వేల సంవత్సరాలైంది. "భారతదేశంలో చెట్లకు ఉన్ని కాస్తుంది" అని విదేశాల వారు గొప్పగా చెప్పుకునే వారట. పత్తి పూలు అందంగా ఉంటాయి. 
రెండు పిలకలు వేసుకున్న పిల్లలను తయారు చేశాను చూడండి. పత్తికాయల్ని విడదీసి ముక్కలను ముఖ భాగానికి అమర్చాను. పత్తి కాయలు నాలుగు భాగాలు కలిసి ఉన్న వాటిని లంగా లాగా కుట్టాను. పువ్వుల డిజైన్ తో అందంగా ఉంది. కళ్ళు ముక్కు, నోరు కూడా పత్తికాయలే. పొలం పని చేసుకునే శ్రామికురాలిగా తీర్చిదిద్దాను.
కామెంట్‌లు