మనిషి చేసే తప్పిదాలు : - ఈగాపాటి రంజాన్ -భద్రాద్రి కొత్తగూడెం.
 మనిషి తీరుకు ఇంకిపోతున్న 
భూగర్భ జలాల అవసరానికి 
బోర్లు వేసి భూగర్భ జలాలను
గుంచుతుంటే ధరణి బలం రోజు రోజుకి ఇంకి పోతున్నాయి 
ఇంకిపోతున్న చెరువు శిఖరము లు....
జలచరాలు జీవఛవాలు నాటిన 
మొక్కకు లేదు కంచె ప్రకృతి వికృతులకు మనిషి అవసరాల
వికృతి చేష్టలకు వైపరీత్యాలు 
మేఘం పిండుతున్న చినుకులను
బంగాళాఖాతంలో కలిపేస్తున్నాము నీటి 
ఇంకుడు గుంతలు పేరుకే పెదాలపై 
పలకబట్టే వేసవి కాలము లో 
భూగర్భ జలాలు అడుగంటుతూ 
జీవకోటికి బ్రతుకు పరీక్ష రాస్తుంది 
వాగులు కుంటలు చెరువు శిఖరము లు 
పూడిక తీసే నింగి నుంచి పడ్డ చినుకు ను
 ఒడిసి పట్టుకొనే ల ప్రాజెక్టులు నిర్మించి 
భూగర్భ జలాలను పెంచుకోవాలి
 ప్రకృతీ వైపరీత్యాల నుండి ప్రాణ కోటిని 
కాపాడుకుంటూ భూమిని భూగర్భ జలాలను కాపాడుకుందాము...!!

కామెంట్‌లు