యాలల పీఎం శ్రీ పాఠశాలలో ఘనంగా వేసవి శిబిరం: వెంకట్ , మొలక ప్రతినిధి
 

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం!: ​హాజరైన ఎంపీడీవో శ్రీనిజ, ఎంఈఓ మహిపాల్ రెడ్డి
​మట్టి పాత్రల తయారీలో విద్యార్థులతో కలిసి సందడి చేసిన అధికారులు


వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 21 పీఎం శ్రీ (PM SHRI) పాఠశాలల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు అత్యంత ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరంలో భాగంగా, యాలాల పీఎం శ్రీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌నకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభిస్తోంది. సుమారు 100 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని తమలోని సృజనాత్మక నైపుణ్యాలకు పదును పెడుతున్నారు.
​ప్రత్యక్ష అనుభూతిని పొందిన ఎంపీడీవో శ్రీనిజ:
ఈ శిబిరంలో భాగంగా నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో యాలాల ఎంపీడీవో శ్రీనిజ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ-చేతివృత్తుల ప్రాధాన్యతను వివరిస్తూ, స్థానిక కుమ్మరి నిష్ణాతుల చేత మట్టితో చిన్న చిన్న వస్తువుల తయారీని విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనిజ గారు స్వయంగా విద్యార్థులతో కలిసి మట్టి వస్తువులను తయారు చేస్తూ, వారితో ప్రత్యక్ష అనుభవాన్ని పంచుకోవడం విశేషం. పర్యావరణానికి అనుకూలమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు.
​నైపుణ్యాల వేదికగా 15 రోజులు – ఎంఈఓ మహిపాల్ రెడ్డి:
మండల విద్యాధికారి (எம்ఈఓ) మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సుప్తచేతనావస్థలోని నైపుణ్యాలను, సర్వతోముఖాభివృద్ధిని వెలికితీయడమే ఈ వేసవి శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ 15 రోజుల్లో ప్రతిరోజూ ఒక సరికొత్త అంశంపై నిష్ణాతులైన వాలంటీర్లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇండోర్ గేమ్స్, ఆటలు, పాటలు, దేశభక్తి గేయాలు, చూచిరాత (హ్యాండ్‌రైటింగ్)తో పాటు శాస్త్రీయ నృత్యమైన కూచిపూడిలో ప్రావీణ్యం, మేధస్సుకు పదును పెట్టే ఇంద్రజాలం (మ్యాజిక్ ట్రిక్స్), మరియు చేతివృత్తులపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన వివరించారు.
 కుమ్మరి కళాకారులను ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధ రామేశ్వర్, కవయిత్రి మొల్ల కళ  వేదిక అధ్యక్షులుKVM వెంకట్,ఉపాధ్యాయులు భ్రమరాంబ, సంధ్య, భార్గవి, నరేష్, అలాగే విశ్వనాధ్‌పూర్ సర్పంచ్ శివశంకర్ , స్థానిక చేతివృత్తుల కళాకారులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కామెంట్‌లు