నాయనా ఇక్ష్వాక వంశ నరేంద్రా
భయము నీకు వలదయ్య
నీవు ధర్మాత్ముడవని నేనెరుగుదునయ్యా
యజ్ఞమునులను పిలిపిస్తానయ్యా
విశ్వామిత్రుడు తన పుత్రులను పిలిచి
యజ్ఞ సామాగ్రిని తెమ్మని తెలిపినాడు
విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచి
సకలవేదశాస్త్రపండితులకు తెలుపుడు
ఎవరైనా నా ఆజ్ఞను దిక్కరించినచో
వారి మాటలను నాకు తెలుపుడు
విశ్వామిత్ర శిష్యులు అతని మాటలు విని
అన్ని దిక్కులకు వారు వెళ్ళినారు
అతని పిలుపునందుకొనిన వారు
వెంటనే విశ్వామిత్రుని వద్దకు వచ్చినారు
వశిష్ట వంద మంది పుత్రులు తప్ప
మీ ఆజ్ఞానుసారం అందరు వస్తున్నారు
వశిష్ట కుమారులు మిక్కిలి కోపంతో
త్రిశంకుని గూర్చిపలు మాటలన్నారు
యజ్ఞము చేయువాడు చండాలుడు
యజ్ఞం చేయించేవాడు క్షత్రీయుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి