నిశ్శబ్ద సేవకురాలు నర్సు: - మంజుల పత్తిపాటి
నైటింగేల్ చూపిన మార్గం ఎంచుకొని....
అనురాగ హస్తాలతో ప్రాణాలు కాపాడే యోధులు..!

వేతనం తక్కువైనా... 
అలసట ఎక్కువైనా....
కరోన లాంటి సమయంలో మృత్యువుకు
భయపడకుండా సేవలందించి...
నైటింగేల్ వారసులై నిలిచిన నిశ్శబ్ద వీరులు..!

మరణాన్ని జయించిన ప్రతి శ్వాస వెనుక...
ఒక నర్సు త్యాగం నిశ్శబ్దంగా నిలుస్తుంది..!

తమ బాధలు హృదయంలో దాచుకుని
చిరునవ్వు చిందిస్తూ రోగికి ఆశల ఔషధ గంధం
ఇచ్చి ధైర్యం ఇస్తుంది..!

సాటి ప్రాణాల కోసం అంకితమైన మీ జీవనం మరిచిపోలేదు మేము..!

రాత్రింబవళ్లు అనక సేవలందిస్తూ...
అలసిన కళ్లలోనూ ఆశ వెలిగిస్తూ...
మానవత్వానికి నిజమైన నిర్వచనం
ఐనా మిమ్ములను మరిచిపోలేదు మేము..!

ప్రతి నర్సుకి వందనం, సేవకు శతకోటి నమనం 
అంతర్జాతీయ నర్సుల దినోత్సవ(మే 12) శుభాకాంక్షలందనం.
====================================
పత్తిపాటి మంజుల 
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.

కామెంట్‌లు