రామా గంగ గూర్చి నేను చెప్పేది విను
హిమాలయము అను పేరుతో
ఒక మహా పర్వతము కలదు
ఆ పర్వతము గిరులలో శ్రేష్టమైనది
ఇనుము రాగి మొదలగు లోహాలకు నెలవైనది
రామా హిమవంతునకు ఇద్దరు కూతుళ్లు
వారు చాలా సౌందర్యవంతులు
మెరుపు కూతురు మేన హిమవంతుని భార్య
ఈ దంపతుల పెద్ద కూతురు గంగాదేవి
వారి రెండో కూతురు పేరు ఉమాదేవి (పార్వతి)
వారిని అల్లారుముద్దుగా పెంచుచున్నారు
గంగా పార్వతి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు
దేవతలందరూ తమ ప్రయోజనార్థమై
పెద్ద కూతురును తనకు ఇవ్వమని అడిగినారు
ముల్లోకాల హితము కోరి హిమవంతుడు
పెద్ద కూతురుని వారికి అప్పగించాడు
రెండో కూతురు కన్యగా నుండి తపస్సునాచరించి
శివుడిని పతిగా కోరి నాది
హిమవంతుడు తన కూతురుని
పరమేశ్వరునికి ఇచ్చి వివాహము చేసినాడు
గంగాపార్వతుల గూర్చి విశ్వామిత్రుడు రామునితో ఇలా తెలిపాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి