మేఘం కప్పిన వెలుగు
ఎంతకాలం ఆగు?
తొలగక తీరదు తెరలు
తెలిసే తీరు చురుకులు!
పచ్చగ మెరిసే పుడమిని
వెచ్చగా తాకిన వేడి
అచ్చంగా వరాలెన్నో
ముచ్చటగా కురిపించె!
మేదిని దాహము తీర్చగ
మేఘమాల వడివడిగా
దూసుకువచ్చే సూచనగా
కరిమబ్బులు మాటువేసె!
జడిలో తడవగా వేచి
గడియ కూడా తెరపి లేక
వేడి పొగలు కక్కుతూ
నేల నింగి వైపు అలసిచూసె!
వసుధకు తాపము పెంచే
భానుడి ప్రతాపము చూసి
కడలి తాను కలత చెంది
కాకను కాస్త తగ్గించ దలచె!
కారణమేదైనా వాన కురిసి
ధరణి కొంతసేపు తడిసె
కరుణించమని వేలుపు
వరుణుని వేడె ధాత్రి!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి