పర్యాటక స్వర్గ సీమ....!!: - యెనుముల వేణుగోపాలరావు- అమలాపురం.

 ఆసియాఖండం లోనే 
అతి పెద్ద మంచినీటి సరస్సు!
ఆ అందం చూస్తే ఉప్పొంగి 
పరవళ్ళు తొక్కుతుంది మనస్సు!
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా 
కైకలూరు మండలం లోఉన్న  కొల్లేరు,
అక్కడికి వెళ్ళితే ఆనందం_ ఏరులైపారు !
ఆకివీడు నుండి కొల్లేరుకు 
ఒకప్పటి లాంచి ప్రయాణం ,
ఆ అందాలు చూడటానికి 
రెండు కళ్లు సరిపోని వైనం !
విదేశాలనుండి ఏటా _
వలసవచ్చే పక్షుల కిలకిల రావాలు,
కనువిందు చేసే అడవులు సోయగాలు !
చూసేవారి వినోదానికాఅన్నట్లుగా 
ఆ సరస్సు లో ఎగిరి పడే 
పలురకాల చేపలు,
అవిచూసి మనం ఎగరెయ్యకుండా ఉండలేము కనుపాపలు !
సరస్సు ప్రక్కన కొలువైన ,
పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం!
ఆ గుడికి వన్నెతెచ్చిన _
ఎత్తైన గాలి గోపురం !
ముందు భాగంలో నూతనంగా నిర్మించిన దేవతా మూర్తుల విగ్రహాలు ,
పాల్గుణ మాసం లో జరిగే జాతరకు వేల సంఖ్యలో వచ్చే జనం ,
అది చూసి ఆహా... అనకుండా ఉండలేము మనం !
సాయంకాలం సరస్సును చూస్తే 
 కలిగే ఆనందం కమనీయం!
మాటలలో వర్ణించలేని ఆ దృశ్యాలు కడు రమణీయం...!
పర్యాటకులకు ఇది
చక్కని సందర్శనా స్థలం..!!
                     ***

కామెంట్‌లు