శహభాష్ బాలాదిత్య .: - పద్మ త్రిపురారి.
  విద్యా వారోత్సవాల్లో భాగంగా ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన క్రాఫ్ట్ మరియు కల్చరల్ కార్యక్రమం లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మంపేటకి చెందిన విద్యార్థి బాలాదిత్య, ఐదు గంటలు కష్టపడి అగ్గిపుల్లలతో చార్మినార్ తయారు చేసాడు.ఇందులో విశేషమేమిటంటే ఈ మధ్య కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేదా ఇతర పోటీలనగానే అమ్మాయిలు బిడియ పడకుండా ప్రదర్శన ఇస్తున్నారు కానీ,పాఠశాలల స్థాయిలో అబ్బాయిల సంఖ్య ఈ విషయాల్లో తక్కువగా ఉన్నదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.మరీ ముఖ్యంగా ఫోన్, టీవీ, ఇతరత్రా  విషయాలకు సమయం ఎక్కువగా కేటాయిస్తున్న పిల్లలు, ఇలాంటి కార్యక్రమాలకు రావడం చాలా తక్కువ సందర్భాల్లో కనిపిస్తున్నది.మొన్నటి రోజున జరిగిన విద్యా వారోత్సవాల్లో కూడా,అలంకరణ వస్తువుల ప్రదర్శనలో, అందరూ అమ్మాయిలే ఉన్నా,బాలాదిత్య మాత్రమే ఏకైక అబ్బాయిగా ప్రదర్శన లో కనపడడం అభినందించదగిన విషయం.ముఖ్యంగా ఇతరత్రా ఎన్నో కార్యక్రమాలకు సమయాన్ని వృధా చేసే పిల్లల సంఖ్య పెరుగుతున్న ఈ కాలంలో బాలాదిత్య,కళాఖండాన్ని రూపొందించడానికి ఐదు గంటల సమయాన్ని వెచ్చించడం నాకైతే గొప్ప విషయంగానే అనిపించింది.మంచి ఎక్కడున్నా,ప్రతిభ ఎవరిలో ఉన్నా అభినందించాలనే ఆరాటం కలిగిన నా అక్షరం, ఈరోజు ఈ అబ్బాయిని అభినందించే సమయాన్ని సఫలం చేసుకున్నది.


అభినందనలు బాలాదిత్య.
జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 
బహుమతులు ముఖ్యమైనవే కావచ్చు.కానీ , ప్రతిభను మెరుగుపరుస్తూ, భవితకు బాటలు వేసే ప్రతి అవకాశమూ మరింత ముఖ్యమైనదే.
మరీ ముఖ్యంగా పాఠశాల స్థాయిలో జరిగే ప్రతీ వేదికలో పొందే అవకాశం తో కూడిన విజయమూ గొప్పదే.ఎందుకంటే అవి మీ ముందు జీవితానికి బలమైన పునాదులు వేస్తాయి.
కామెంట్‌లు