ఓ శ్రీరామ రాజార్సీ అయినా కుశనాభుడు
ధర్మాత్మురాలైన తన భార్య ఘృతాచి
నూరు మంది కన్య రత్నములను
సంతానముగా తాను పొందినది
ఆ కన్యలంతా రూప యవ్వన వంతులు
పూలను చందనములను తిలకమును
వారు చక్కగా అలంకరించుకొని
వర్షాకాలం మెరుపుతీగలా ఉంటారు
సర్వాంగ సుందరలు ఉద్యానవనమునకు వచ్చి
ఆకాశాన తారల వలె విరజిల్లుచున్నారు
వారు సర్వసద్గుణ సంపన్నులు
వారిని చూసి వాయుదేవుడు ముగ్దుడైనాడు
నేను మిమ్ములను కోరుచున్నాను
మీరందరూ నన్ను భర్తగా స్వీకరించుడు
మానవ రూప మమకారమును వీడి
దీర్ఘాయువును పొంది దేవతల ఉండుము
మా తండ్రి సత్యవాది ఆయన కోపానికి గురికాకు
ఆయన వలన నీవు మృత్యువు పొందెదవు
వారి మాటలు విని వాయుదేవుడు
వారిలో చేరి వారిని గూని వారీగా మార్చినాడు
వారి రూపాలను చూసి వారి తండ్రి చాలా చింతించినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి