రామ ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది
ఆ మహర్షి భార్య అహల్యతో ఉండేవాడు
గౌతమ మహర్షి లేని సమయమున
శచీపతియైన దేవేంద్రుడు చెడు యోచనలో
గౌతమ మహర్షి వేషము ధరించి
అహల్య వద్దకు వచ్చి నిలచినాడు
ఆమె తపోదీక్షన అతనిని గుర్తించి
ఇలా రావడము నీకు తగదు దేవేంద్ర
నది నుండి మహర్షి రాకముందే వెళ్ళిపో
గౌతమ ముని వచ్చినాడు ఆచటికి
కోపంతో దేవేంద్రుని శపించినాడు
అహల్యను భస్మ రాయిగా మారుమన్నాడు
రాముని పాదము సోకిన నాడు
నీ రూపము నీకు వస్తుందని శపించినాడు
వారిరువురు శాపానికి గురి అయినారు
ఆనాటి నుండి ఆశ్రమం ఇలా ఉన్నది రామా
దేవేంద్రుని అహల్యను శాపించిన పిదప
గౌతమ మహర్షి పాపము తొలుగుటకై
ఈ ఆశ్రమమును వదిలిపెట్టి వెళ్ళి
పర్వత గీరులలో తపస్సు జేయుచున్నాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి