యాలకులతో యామిని: -డా. కందేపి రాణీప్రసాద్

 హలో పిల్లలూ! యాలకుల్ని చూశారా! ఎక్కడ చూశారు! పాయసంలో చూసి ఉంటారు. ఇంకా స్వీట్లలో చేసి ఉంటారు కదా! మరి తీపి పదార్థాల్లో వాడుకునే యాలకులతో అమ్మాయిని సృష్టించవచ్చా!. అంటే అవును’ అని చెప్పండి. ఎలాగో నేనిప్పుడు మీకు చూపిస్తాను.మొదటగా యాలకుల గురించి తెలుసుకుందాం!.యాలకులు ఒక సుగంధ ద్రవ్యమని వృక్షశాస్త్రంలో చదువుకున్నాం. ఇది జింజిరేసి కుటుంబానికి చెందిన మొక్క నేను తొలిసారిగా అరకు లోయలోని ఉద్యానవనంలో చూశాను. చదువుకునేటప్పుడు బోటానికల్ టూర్‌లో భాగంగా అనేక వ్యవసాయ క్షేత్రాలు చూపించారు. ఆ తర్వాత చాలా చోట్ల చూశాను. దీనిని సుగంధ ద్రవ్యాల రాణీ అని పిలుస్తారు. వీటి ఆకులు చాలా పొడవుగా ఉంటాయి. ఈటె ఆకారంలో ఉంటాయి. ఇవి ఎంత పురాతనమైనవంటే 2వ శతాబ్ధంలో శుశ్రుతుడు రాసిన ‘చరక సంహిత’ లోనూ, 4వ శతాబ్ధంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలోనూ యాలకుల ప్రస్తావన ఉన్నది. వీటిలో పచ్చ యాలకులు, నల్ల యాలకులు అని రెండు రకాలుంటాయి. యాలకులను కాఫీ, టీ లతోనూ కలిపి తాగుతారు.
యాలకులతో ముఖం, శరీరం తయారు చేశాను. జుట్టును ఒక వైపుకు ముడి వేశాను. ఒక చెయ్యి నడుం మీద పెట్టుకుని మరోక చెయ్యి వేలాడేసిన  అమ్మాయిని చేశాను. ఈ అమ్మాయికి కుట్టిన గౌనులో మిరియాలు కూడా పెట్టాను. డిజైనర్ వేర్‌లు కుట్టే బోటిక్‌ల కన్నా నేను వెరైటీగా కుట్టాను కదా! చెవులకు జూకాలు పెట్టుకుని ఒకింత సంభ్రమంగా చూస్తోంది.
కామెంట్‌లు