మంబాపూర్‌లో ఘనంగా ముగిసిన సమ్మర్ క్యాంప్ :- వెంకట్ , మొలక ప్రతినిధి

 బాల్య దశలోనే దేశభక్తిని పెంపొందించుకోవాలి :  గాజుల  బస్వ రాజ్
శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూర్ వారి సౌజన్యంతో మంబాపూర్ గ్రామంలో 15 రోజులపాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ (బాల వికాస కేంద్రం) ముగింపు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ రామకృష్ణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు  గాజుల బస్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు.
సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీయడంలో ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. నేటి సమాజంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అలవాటు పడి చదవడం, రాయడం, ఆటలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద భావజాలాన్ని బాల్య దశ నుంచే అలవర్చుకుని దేశానికి అవసరమైన మంచి పౌరులుగా ఎదగాలని దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
గ్రామ సర్పంచ్ భార్గవి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలు, సంస్కారం, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఇలాంటి బాల వికాస కేంద్రాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గ్రామంలో జరిగే ప్రతి మంచి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమ కన్వీనర్ KVM వెంకట్ మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ విజయవంతానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాథ్స్‌తో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన ప్రేరణ, అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.  విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా అందిస్తామన్నారు వాలంటీర్లుగా సేవలందించిన సంతోష్, పద్మ, ప్రసన్నలను ఘనంగా సత్కరించారు.
క్యాంప్‌లో పాల్గొన్న చిన్నారులు శ్లోకాలు, సూక్తులు, పాటలు, పెద్దల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు తమ మనసులో మాటను పంచుకుంటూ క్యాంప్ అనుభవాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మోహిద్, మాజీ ఎంపీటీసీ యాల టి శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం వీరప్ప, శ్రీ శారద విద్యా మందిర్ ప్రిన్సిపల్ సంతోష్, ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, క్యాంప్ వాలంటీర్లు పద్మ, ప్రసన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు