జీవ జలం. : - తాతోలు దుర్గాచారి.తెలంగాణ సాహితి -భద్రాచలం.

 సకల ప్రాణికోటి కి జలమే జీవం.
సమస్త జీవకోటికి జలమే ప్రాణం. 
జలము లేనిదే జగమే లేదు. 
జలము లేనిదే జననమేలేదు  
సకల ప్రాణులపుట్టిల్లునేలమ్మ 
నేలతల్లి ఒడిలోనేజీవస్థావరం 
భూగర్భజలమే జీవనాధారం!  
ప్రకృతి ఒడిలో పెరిగే మనిషే..  ప్రకృతినే నాశనం చేస్తున్నాడు 
జల వనరులైన చెరువులను పూడ్చి కాంక్రీటు బీళ్ళుచేస్తూ 
జలధుల్నిఎండగడుతున్నాడు  
జలధారల్ని వృధాచేస్తున్నాడు 
బోరులెన్నో తీసి  నేలమ్మకు తూట్లు పొడుస్తున్నాడు. 
చెట్లను నరికి పచ్చదనానికి విధ్వంసం సృష్టిస్తున్నాడు..
ఇంకెక్కడా భూగర్భ జలాలు 
రైతన్నకు కానరాని ఫలాలు.! 
పొలాలన్నీ కాంక్రీటు ప్లాట్లౌతూ  
కడుపు నింపే రైతే... కనుమరుగౌతున్నాడు..
ఓ మానవా.ఇకనైనా మేలుకో  
ఇంటికో ఇంకుడు గుంటను..
తవ్వించి జలాల్ని కాపాడుకో! 
పచ్చదనాన్ని కాపాడి.. పర్యావరణాన్ని రక్షించుకో.!!
జలమే జీవం,జలమే ప్రాణం.. 
భూగర్భ జలమే సమస్త జీవకోటికి ప్రాణాధారము. 
******** 

కామెంట్‌లు