ఈద్ అల్-అధా సందేశం---మంజుల పత్తిపాటి.

  ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ  డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ ఈద్ అల్-అధా పవిత్ర పండుగ కేవలం ఆనందోత్సవం మాత్రమే కాదని, ఇది తక్వా , సబ్ర్ మరియు త్యాగానికి ప్రతీక అని అన్నారు.
ఈ పండుగ ద్వారా మనిషి తన అహంకారాన్ని కుర్బానీ చేసి, నఫ్స్ ను నియంత్రించుకోవాలని తెలిపారు. స్వార్థాన్ని విడిచిపెట్టి, ఇఖ్లాస్ తో జీవించే హృదయంలోనే అల్లాహ్ రహ్మత్ ఉంటుందని ఆమె అన్నారు.
మనిషిని మతంతో కాకుండా మనసుతో కొలవాలని ఈ పండుగ ప్రపంచానికి సందేశం ఇస్తోందన్నారు. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సంపద కాదు, ఇన్సానియత్   అని తెలిపారు.
క్రోధాన్ని రహ్మత్‌గా, ద్వేషాన్ని ముహబ్బత్‌గా, అహంకారాన్ని వినయంగా మార్చడమే నిజమైన ఇబాదత్ అని ఆమె పేర్కొన్నారు. అల్లాహ్ రహ్మత్, బరకత్, సలాం ప్రతి హృదయంలో నూరుగా నిండాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్ర పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కామెంట్‌లు