విద్యార్థుల కనురెప్పల మాటున దాగిన నిద్రను దూరం చేసి...
చదువుల దారిలో వెలుగై నిలుస్తుంది టీ..!
మంచు కొండల్లో పహారా కాస్తున్న సైనికుల
గుండెల్లో వేడి నింపి నూతనత్తేజాన్ని ఇస్తుంది టీ..!
సాయంత్ర వేళలో వర్షపు తుంపరలు మేనుపై
సంగీత కచేరి చేస్తుంటే...
తుంటరి పిల్ల గాలులు మధుర జ్ఞాపకాలను తట్టి మేలుకొలుపుతుంటే...
నులివెచ్చని టీ గొంతులోకి జారుతుంటే..
అలసిన జీవితం మీద
ఆశలు తిరుగుబాటు చేసే..!
నక్షత్రాల పందిరి కింద
ఒక చుక్క టీ పెదవిని తాకగానే...
మంజుల కవితా కలానికి మత్తెక్కి
కాలం దాచిన మగువ చెమట
చాయ్ రంగులో కరిగిన సంధ్యలా...
ఆమె అక్షరాలు గుండెలో తిరుగుబాటు చేసే..!
మౌనం ఎప్పుడూ ఓటమి కాదని...
గాయాల గర్భంలో గుసగుసలాడే అక్షరానికి
ధైర్యం నేర్పింది టీ..!
ఒంటరి మనసుల అంచులపై
ఆత్మీయతగా ఆవిరై నిలిచి,
చీకటిలో చిగురించే చిన్న ఆశలా
ప్రతి హృదయంలో వెలుగై మిగిలిపోతుంది టీ..!
=========================================================
టీ ప్రియులందరికీ అంతర్జాతీయ చాయ్ (మే 21) దినోత్సవ శుభాకాంక్షలు.
=========================================================
పత్తిపాటి మంజుల
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి