రారాజు...!!: యెనుముల. వేణుగోపాలరావు - అమలాపురం.

 రుచిలో రారాజు ....?
ఇంకెవరూ....
మామిడి పండు !
ఏ ఇతర పండు 
దాని దరిదాపుల్లోకి ,
రాలేదుసుమండీ!
అబ్బబ్బా..... ఏమి రుచి 
బంగినపల్లి మామిడిపండు ,
తింటుంటే చూసేవారికి _
నోరూరుతుంటుంది...!
నూజివీడు చెఱకు రసం ,
ఎంత దూరమైనా వెళ్ళవచ్చు,
దాని కోసం ,
పేరు వింటేనే నోట్లో ఊరుతుంది _
లాలాజలం,
తింటే తిరిగి వస్తుంది 
పోతుంది అనుకున్న ప్రాణం !
పాపారావు గోవాతింటే _
వెళ్ళి వచ్చినట్టుంది గోవా ,
తీరిపోతుంది _
మంచి పండు తినాలన్న యావ !
కలెక్టర్ మామిడి పండు 
హోదాలో ఏమాత్రం తీసిపోదు సుమండీ...
తింటే జివ్వహ్హ చల్లబడుతుంది!
నీలం మామిడి పండు చూడు
తీపి , పులుపు మిళితం అయి
తింటుంటే ప్రాణానికి 
హాయిగా ఉంటుంది...!
తోతా పురి ఒకసారి తింటే ,
మరి ,వెళ్ళిపోయినా పరవాలేదు 
యమ పురికి !
అందుకే... 
ఇంత రుచికరమైన 
మామిడి పండు,
ముందు వెనుక ఆలోచించక 
తినేస్తువుండాలి _
ఆబగా.. సీజన్ అంతా...!!
                 ***
కామెంట్‌లు