ఏ చిక్కు ముడులు
ఎవరికి తెలియక
విడిపోయి వేడుకలు
కొని తెస్తాయో....
ఏ దూరమైన జంటల
అపార్థ సమస్యలు
వాటికవే చక్కబడి
దగ్గర చేస్తాయో....
ఏ కన్నీటి కథలకు
చక్కని ఓదార్పుగా
ఏ ముగింపు దొరికి
ఆనందిస్తాయో.....
ఏ సమస్యల వలయాలు
ఎంతగానో చుట్టుముట్టి
ఏడిపిస్తున్న బ్రతుకులకు
ఏ ఆధారం దొరుకుతుందో...
గమ్యం అంటూ లేక
గాలి వాటున సాగుతున్న
జీవన నౌకలకు ఏ తీరం
దూరాన కనిపిస్తుందో.....
ఏ తీపి కబురు
అందాల్సిన చోటుకి
అతి పదిలంగా అందించాలనో
వస్తున్న వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి