బ్రహ్మ దత్తుని జన్మ వృత్తాంతము:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
కుశనాభుడు బిడ్డల గూని గూర్చి అడిగినాడు 
వాయు దేవుడు మమ్ములను బలాత్కరించినాడు 
మేము అతడిని ప్రతిఘటించినందుకు ఈ 
మమ్ములను ఈ రూపాలుగా మార్చినాడు 

మీరు మన వంశ గౌరవము నిలిపినారు 
క్షమించు గుణము గొప్ప భూషణం 
ఓ కుమార్తె లారా సత్య ప్రవర్తన వలనను
పరమధర్మము క్షమపైననే నిలిచియున్నది

కుశభ మహారాజు తమ దేశ ఆచారప్రకారంగా
తన వంశమునకు తగినట్టుగా
కన్యాదానము చేయాలని నిశ్చయించుకొని 
అతని మంత్రులతో ఆలోచించినాడు 

ఈ కాలమందున చూలీ అను ముని 
బ్రహ్మ గూర్చి తపస్సు చేయుచుండెను 
సోమద అను గంధర్వ స్త్రీ 
ఆ మునికి సపర్యములు చేయుచుండెను 

ఆమె చేసే సేవకు ముని సంతోషించి 
ఆమెను ఏదైనా వరం 
కోరుకోమన్నాడు 
అందుకు ఆమె సంతోషించి 
నాకు బ్రహ్మజ్ఞానం గల పుత్రుని ప్రసాదించు స్వామి 


కామెంట్‌లు