--ఎఫ్ఆర్ఎస్ లో జిల్లా టాపర్ గా నిలిచినందుకు దక్కిన అరుదైన గౌరవం
-- ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో ఈర్ల సమ్మయ్యకు ఘన సన్మానం
ఆన్ లైన్ ముఖ గుర్తింపు వ్యవస్థ ( ఎఫ్ఆర్ఎస్ - ఫెషియల్ రికాగ్నిషన్ సిస్టం) లో జిల్లా టాపర్ గా నిలిచినందుకు గాను పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యను ఆదివారం ఉదయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, తెలంగాణ రాష్ట్ర విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావులు ఘనంగా సన్మానించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఈర్ల సమ్మయ్య ఎఫ్ఆర్ఎస్ లో, పాఠశాల హాజరు శాతంలో పెద్దపల్లి జిల్లా స్థాయిలో టాపర్ గా నిలవడంతో ఆయనను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈర్ల సమ్మయ్య గత రెండేళ్లుగా ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా అంకితభావంతో పనిచేస్తూ, పాఠశాలలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలతో పాటు పిల్లల అభివృద్దే ధ్యేయంగా అహర్నిశలు కష్టపడి, అంకితభావంతో పనిచేస్తున్న ఈర్ల సమ్మయ్యను గ్రామస్తులు, మండల, జిల్లాలోని ప్రజలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందిస్తున్నారు. విద్యా రంగంలో ఈర్ల సమ్మయ్య చేస్తున్న అద్భుతమైన సేవలను కొనియాడుతున్నారు. ఒకే వేదికపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈవో ఇతర అధికారుల చేతుల మీదుగా సన్మానం పొందడం చాలా సంతోషంగా ఉందని ఈర్ల సమ్మయ్య తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి