గౌతమముణి పెద్ద కుమారుడు శతానందుడు
తన తల్లి హాలియా శాప విముక్తి గాంచిన
శ్రీరాముని గాంచి పులకితుడైనాడు
రామ పాదము సోకిన తల్లి పుణ్యావతని
శతానందడు రామునికి స్వాగతం తెలిపినాడు
రామ విశ్వామిత్రుని పూర్వ గాధ వినుము
మా భాగ్య ఫలం విశ్వామిత్రుడు
తపోబలముచే బ్రహ్మార్షైయినాడు
ఆయన కార్యాలోచనలు ఊహించనలవికానివి
నీకు పరమహితకారి అతడు
అతని గూర్చి నీవెరుగుదువు కదరామా
గొప్ప తపశ్శాలి నీకతడు రక్షకుడు
కౌశిక్ ని యొక్క తపః ప్రభావము
అతన్ని చరిత్ర వైభవములను
నీకు తెలిపెద సావధానుడవై వినుము
అతడు సమస్త విద్యలనెరిగినవాడు
అనుక్షణం ప్రజాక్షేమము కోరువాడు
కుశ మహారాజ ప్రజాపతి కుమారుడు
బ్రహ్మపుత్రులున్న మరో బ్రహ్మ లోకం మును
దర్శించుకున్న బలశాలి విశ్వామిత్రుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి