సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -224: ఆ వూరోళ్ళ అంబలి తాగి దూవూరోళ్ళ దూడలు కాశినట్లు
***
అంటే అన్ననని అంటరు గని  కొంతమందిరి సేశే శకలు సూత్తుంటే ఏమనాల్నో తెల్వదవ్వా! మడుసులకు రాన్రానూ నియతి  లేకుండ బోతున్నది."
ఏంది శెల్లె ఏమైంది? ఎవలి యిష్యం నువ్వు జెప్తున్నది. ఎవలికి నియతి లేంది ! ఏం జేసింట్రేఃటి?
మా అక్క బావోళ్ళ యిష్యమే అవ్వా! దిమాకి ఉండి శేత్తుండ్రా?అంకారంతో శేత్తుండ్రా తెల్వట్లేదవ్వా'."
గింతకీ ఏం జేసిండ్రో ఎందుకు జేసిండ్రో తెలిత్తె గద శెల్లే! నువ్వన్న యిష్యం పురాగ సమజయ్యేది.
 "మా అక్క బావోళ్ళకి  కొడుకుల యిష్యం తెల్సుగద!ఏనాడూ గాళ్ళ సద్వుల యిష్యం, బవిశెత్తు యిశారించలే.. గాళ్ళిద్దట్ల పెద్దోడు సద్వబ్బక ఏద్దొరికితే గా పని జేసి బత్కుతున్నడు.ఇంగ శిన్నోడికి శిన్నతనం కానించి సద్వు మీద కాయుషు ఎక్వ.. గందకని అన్నను నాయన్ను వజ పెట్టి   పీజులు గట్టిచ్చుకుని మంచి ఉజ్జోగమే సాదిచ్చిండు. ఇద్దర్కీ పెండ్లీలు అయినవి. ఎవలి సక్కిన గాళ్ళు బత్కుతున్నరు.
"ఇంకేం శెల్లే! మీ అక్క బావ బాద్దెతలు మా బాగ దీర్సుకుండ్రు."
అవును అవ్వా!గీ నడ్మల ఒంట్లె బాగలేదని పెద్ధోడి తానికి బొయ్యి ఉంటుండ్రు.ఉంటె ఉన్నరు గనిగంత వొలపచ్చం ఎందుకు శెప్పు?  తక్వ సంపాదనైనా మా అక్క బావని   పెద్దోడు,గాని పెళ్ళాం సక్కగ బంగారం లెక్క సూస్కుంటుర్రు.
అప్పే శేత్తుండో,పొద్దత్తమానం రెక్కలు ముక్కలు జేస్కుండో గని ఇంట్లోళ్ళను, అమ్మ నాయినకి ఏం లోటు లేకుండా సూత్తుండు.
 "గస్మంటి మంచి మడిశి బాగోగులు సూస్కోవల్శిన అవసరముంది గదవ్వా.గది పక్కన బెట్టి ఎప్పుడు సూశినా శిన్నోడు ముచ్చెటినే."
 
"పెద్దోడు నా తాన కొచ్చి నేను అమ్మ నాయినకి ఎంత జేసినా తుత్తి లేదు. నిద్దట్ల సుత తమ్ముని బాగోగులు కల్వరిత్తుండని."  జెప్పుకుని మస్తు బాద వడ్డడవ్వా?!;*
"నువ్వన్నట్టు కొంత మందిరి గట్లనే ఉంటుండ్రు శెల్లే! "ఆ వూరోళ్ళ అంబలి తాగి దూవూరోళ్ళ దూడల్ని గాశినట్లు"ఉంది గాల్ల యవ్వారం  శెల్లే!
"అవునవ్వా! అచ్చర సత్తెం మాట్లాడినవ్. ఎంత పేమ వున్నా  గాళ్ళని సూశే పద్దతిలో తేడాలొత్తె గిస్మంటివే బయటికొత్తయి.
 ఒకలి శేత సాయం బొందుకుంట ఇంకోళ్ళకి సేవలు జేత్తుంటే,గాళ్ళ బాగోగులు యిశారిత్తే గిట్లనే అంటరు శెల్లే!"
ఏం జేసినా అద్దం ముఖం లెక్క అగవడాలి.అంతేగని తేడా జేత్తె తేడాలొత్తయి శెల్లే!"
గదండీ సంగతి!  " ఆ వూరోళ్ళ అంబలి దాగి దువూరోళ్ళ దూడలు కాశినట్లు"అంటే గిదే మరి! కొంత మందిరి పెద్దోళ్ళు అంటరు గిక్కడ సద్వు సందె నేర్సుకొని ఇదేశాలెల్లి గాళ్ళకి లాబం జేసుడు సుత గిస్మంటిదే అని"
కామెంట్‌లు